ఢిల్లీలో త్వరలో ఇంటికే మద్యం డెలివరీ

 


న్యూఢిల్లీ, సామాజిక స్పందన:

ఇప్పటి వరకు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. కోవిడ్ వల్ల ఇది మరింత మందికి అలవాటైంది. మెడిసిన్స్, ఫుడ్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నింటినీ నెట్లో చూసి చకచకా ఆర్డర్ పెట్టేస్తున్నారు. అయితే మందుబాబులకు మాత్రం ఈ సదుపాయం లేక నిరాశకు గురవుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వారి కల నెరవేరనుంది. మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కొత్త విధానానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం ఆమోదం తెలిపింది.

ఇటీవల కాలంలో మద్యం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో మద్యం ధరలను 25 శాతం తగ్గిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీలోని కేజీవాల్ సర్కారు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు యత్నాలు చేస్తోంది. త్వరలో ఇంటికే మద్యం డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.


@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్, ఎస్పీ ఫకీరప్ప సంచలన వ్యాఖ్యలు   


అనంతపురం, సామాజిక స్పందన:

 ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది.  వైఎస్సార్‌సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. 


బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్‌ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. 


సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేశారు. యూకేలో రిజిస్టర్‌ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్‌ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్‌, రీపోస్ట్‌ చేయడం వల్ల అది ఒరిజినల్‌ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్‌ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.